ADD

Tuesday, 22 March 2016

కర్షకుల కరెంట్ కష్టాలు తీరుస్తున్న కృషీవలుడు కెసిఆర్ రేపటి నుండి 9గంటలు 3ఫేజ్ కరెంటు....!

కర్షకుల కరెంట్ కష్టాలు తీరుస్తున్న కృషీవలుడు కెసిఆర్

రేపటి నుండి 9గంటలు 3ఫేజ్ కరెంటు....!


ఆరుదశాబ్దాల తెలంగాణా స్వప్నం సాకారమయ్యే సమయంలో తెలంగాణా రైతాంగం కరెంటు కష్టాలతో ఎప్పుడు వస్తుందో??ఎంత సమయం కరెంటు ఉంటుందో???ఏ అర్దరాత్రి సమయంలో 3ఫేజ్ కరెంటు ఇస్తారో???ఇచ్చినా ఎన్నిగంటలు ఉంటుందో ???ఉన్న సమయంలోను ఎన్ని సార్లు మధ్యమధ్యలో పోతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమ రథ సారధి స్వరాష్ట్ర సారధిగా మారి స్వయానా రైతు అయిన కెసిఆర్ కర్షకుల కరెంటు కష్టాలను తీర్చుటకు నిర్విరామంగా శ్రమించి తెలంగాణా విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడానికి పవర్ ప్లాంటుల నిర్మాణ పనులను యుద్దప్రతిపాదికన చేపడుతూ ముందుకు దూసుకెళ్తున్న కెసిఆర్. 
మాట తప్పకుండా ,మడిమ తిప్పకుండా అనుకున్న సమయంలో రేపటి నుండి వ్యవసాయ రంగానికి 9గంటల 3ఫేజ్ కరెంటు ఇచ్చేందుకు సిద్దమై 'కర్షకుల కరెంటు కష్టాలు తీరుస్తున్న కృషీవలుడు కెసిఆర్ కి అఖండ తెలంగాణా అన్నదాతాల ఆత్మీయ అభినందనలు'. 

No comments:

Post a Comment