బీసీ,అగ్రవర్ణ పేద ఆడపిల్లలకూ కల్యాణ లక్ష్మి
ఇప్పటికే ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ పేదింటి ఆడపిల్లల పెళ్లికి చేదోడువాదోడుగా నిలిస్తున్న కల్యాణ లక్ష్మి పథకాన్ని ఇకపై బీసీ,ఓసీ లలోని పేద ఆడపిల్లలకు సైతం వర్తింప జేయాటానికి ప్రణాళిక సిద్దం చేస్తుంది. ఈ పథకం లో మధ్యవర్తులు,బ్రోకర్లు ఎక్కువ అవుతుండటంతో పథకం పక్కదారి పడుతుండటంతో దీనిపై టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ఏసీబీ నిఘా పెంచి అసలైన లబ్ది దారులకు అన్యాయం జరగకుండా చూసేందుకు చర్యలు తీసుకుని బీసీ,ఓసీ పేద ఆడపిల్లలకు ఈ పథక గైడ్లైన్స్ వెలువరించాలని సర్కార్ భావిస్తుంది. 15రోజుల్లో ఈ విధివిధానాలను వెలువరించే అవకాశం ఉంది. కల్యాణ లక్ష్మి పథకానికి ఈ బడ్జెట్ లో 738కోట్లు ,షాదీ ముబారక్ కి 150కోట్లు కేటాయించిన కెసిఆర్ సర్కార్ పేదింటి ఆడపిల్లలకు అండగా నిలవనుంది.
No comments:
Post a Comment