ADD

Wednesday, 23 March 2016

తెలంగాణాలో అయిదు ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కి అనుమతి

తెలంగాణాలో అయిదు ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కి అనుమతి 

తెలంగాణాలో అయిదు జిల్లాల్లో అయిదు పారిశ్రామిక సమూహాలకు కేంద్ర అనుమతి లబించింది. తెలంగాణా ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం ,జాతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి కార్యక్రమం కింద తెలంగాణాలోని కరీంనగర్ లోని బావుపేట్ ప్రాంతంలో గ్రానైట్ క్లస్టర్ ,ఖమ్మం లో గ్రానైట్ శుద్ధి క్లస్టర్ ,నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతం,నిజామాబాద్ లో రైసు మిల్లుల సమూహం,ఆదిలాబాద్ లో పత్తి జిన్నింగ్ మిల్లుల సమూహం ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది. ఇందులో బాగంగా ప్రతి క్లస్టర్ లో 100-150చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశం ఉంటుంది . ఈ క్లస్టర్ లకు సాదారణ మౌలిక వసతులకు 10కోట్లు,ఉమ్మడి సౌకర్యాల కేంద్రం నిర్మాణం కింద 5కోట్లు,సాంకేతిక సాయం కింద 25లక్షలు కేటాయించనుంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు ,సమాఖ్యలు అధ్వర్యంలో సూక్ష్మ ,చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎమ్ఎస్ఎమ్ఈ ద్వారా వీటి ఏర్పాటుకు కావలసిన మౌలిక వసతులు,సాంకేతిక నైపుణ్యం,పెట్టుబడులకు మూలధనం,మార్కెటింగ్ సహాయం అందిస్తుంది . ఈ పరిశ్రమల సమూహాల అభివృద్ధి ,నిర్వాహణ బాద్యతను టిఎస్ఐఐసి కి అప్పగించింది. 

No comments:

Post a Comment