అల్లుడి ఇలాకాలో ఎన్నికల నగారా;సిద్దిపేట్ మున్సిపల్ ఎన్నికల షెడ్యుల్డ్ విడుదల
అల్లుడు హరీష్ రావు ఇలాక సిద్దిపేట్ మున్సిపాలిటీకి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. గత కొన్ని రోజులుగా నగర శివారు పంచాయితిలను సిద్దిపేట్ మున్సిపాలిటీలో విలీనంపై హై కోర్టులో స్టే ఉండటంతో ఎన్నికల నిర్వాహణ చాల ఆలస్యం అయింది ,హై కోర్టు తీర్పు వెలువడటంతో ఈరోజు ఎన్నికల సంఘం షెడ్యుల్డ్ విడుదల చేసింది . రేపటినుంచి 23వరకు నామినేషన్ల స్వీకరాణ,24న నామినేషన్ల పరిశీలన ,25న నామినేషన్ల ఉపసంహరణ గడువు విదించింది. 34వార్డులకు గాను 88,982మంది ఓటర్లు ఉన్న సిద్దిపేట్ మున్సిపాలిటీ పరిదిలో 84పోలింగ్ కేంద్రాల్లో 35మంది మైక్రో అబ్జర్వర్లు ఏప్రిల్ 6న ఎన్నికలు నిర్వహించి 11న ఎన్నికల లెక్కింపు నిర్వహించనున్నారు.
No comments:
Post a Comment