ADD

Sunday, 20 March 2016

జనంలో ఉంటా...జనంలా ఉంటా... ఎక్కడికైనా ఇలాగేవస్తా... ఇలాగే ఉంటా...:సర్దార్ గబ్బర్ సింగ్

జనంలో ఉంటా...జనంలా ఉంటా... 

ఎక్కడికైనా ఇలాగేవస్తా... ఇలాగే ఉంటా...:సర్దార్ గబ్బర్ సింగ్ 

  సర్దార్   గబ్బర్ సింగ్ న్యూ ట్రైలర్
మెగా అభిమానులకు పసందైన షడ్రుచుల బోజనంలా సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో అభిమానుల కోలాహలంతో మెగాస్టార్ చేతులమీదుగా విడుదలైంది. సంచలనాల కేంద్రంగా ఏప్రిల్ 8న తెలుగు సంవత్సరాది ఉగాది రోజున విడుదల కానున్న సర్దార్ గబ్బర్ సింగ్ థియరిటికల్ ట్రైలర్ లో మాటల తూటాలు పేల్చాడు. "పొగరెక్కి తల ఎగరేసే నీలాంటోడు పుట్టిన ప్రతిసారి తెగనరకటానికి నాలాంటి వాడు పుడుతూనే ఉంటాడు" 'ఒక్కడినే... ఎక్కడికైనా ఇలాగే వస్తా... ఇలాగే ఉంటా... జనంలో ఉంటా ... జనంలా ఉంటా... "అంటూ మాటల తూటాలు పేల్చాడు. శరత్ మరార్ నిర్మాతగా ,బాబీ దర్శకత్వంలో పవన్-కాజల్ జంటగా వస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సంచలనాలకు మరో పక్షం రోజులు ఎదురు చూడాల్సిందే. 

No comments:

Post a Comment