ADD

Wednesday, 23 March 2016

సర్దార్ ట్రైలర్ కి సల్మాన్ ఫిదా...!

సర్దార్ ట్రైలర్ కి సల్మాన్ ఫిదా...!

టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోను సర్దార్ గబ్బర్ సింగ్ హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో అభిమానుల అంచనాలు అంబరాన్ని అంటగా ప్రస్తుతం బాలీవుడ్ లోను సర్దార్ ట్రైలర్ కి ఫిదా అవుతున్నారు. బిగ్ బీ అమితాబ్ సర్దార్ ట్రైలర్ కి ప్రసంశల్లో ముంచెత్తగా,సల్మాన్ ఖాన్ పవన్ ని ఆకాశానికేత్తేస్తున్నాడు. సర్దార్ లో పవన్ లా నేను అస్సలు చేయలేను,పవన్ నిజంగా చాలా గ్రేట్ ,పవన్ కచ్చితంగా బాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకుంటాడు అంటున్న సల్మాన్ హిందీలో సర్దార్ గబ్బర్ ప్రమోషన్లో సైతం పాల్గోననున్నాడని సమాచారం.ఏప్రిల్ 8న విడుదల అవనున్న సర్దార్ గబ్బర్ సింగ్ తెలుగు తో పాటు హిందీ వెర్షన్ ఒకేసారి విడుదల అవనుంది. హిందీ లో 800స్క్రీన్లలో బారీ ఎత్తున విడుదల చేయనున్నారు. 

No comments:

Post a Comment