ADD

Thursday 3 March 2016

తెలంగాణాలో మరో మూడు విమానాశ్రయాలు

తెలంగాణాలో మరో మూడు విమానాశ్రయాలు 


తెలంగాణాలో ఇప్పుడున్న విమానాశ్రయానికి తోడుగా మరో మూడు విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ పేర్కొంది వీటి ఏర్పాటుకు తెలంగాణా ప్రభుత్వం తోడ్పాటు అందించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వర్యులు అశోక గజపతి రాజు పేర్కొన్నారు. ఆదిలాబాద్ లో విమానాశ్రయానికి మూడేళ్ళ కిందటే సర్వే నిర్వహించగా విమానాశ్రయానికి 940ఎకరాలు కేటాయించాలని కోరారు. ఖమ్మంజిల్లా కొత్తగూడెం లో రాష్ట్ర ప్రభుత్వం చూపించిన స్థలం విమానాశ్రయ నిర్మాణానికి అనువుగా లేదనడంతో మరొక స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వరంగల్ లో మమ్నూర్ ప్రాంతంలోని పాత ఎయిర్ పోర్ట్ స్థలానికి అదనంగా మరో 400ఎకరాలు కేటాయించాలని,హైదరాబాద్ లో శంషాబాద్ కి తోడుగా హకీం పేటలో మరో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలని గతంలో కెసిఆర్ ప్రతిపాదించగా శంషాబాద్ కి హకీంపేట్ 34కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్నందున మరో ఎయిర్ పోర్ట్ సాధ్యం కాదని రాష్ట్రానికి రాసిన లేఖలో కేంద్ర పౌర విమానయాన శాఖ పేర్కొంది. ఈ లేఖ పై సత్వరమే స్పందించుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించింది. 


No comments:

Post a Comment