ADD

Sunday, 4 September 2016

మరో తెలంగాణోడి గవర్నర్ గిరి... ! త్వరలో తమిళనాడు గవర్నర్ గా మోత్కుపల్లి ???

మరో తెలంగాణోడి గవర్నర్ గిరి... !

త్వరలో తమిళనాడు గవర్నర్ గా  మోత్కుపల్లి ???


మోత్కుపల్లి ఎదురుచూపులు ఫలించే రోజులు దగ్గరపడ్డాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మోత్కుపల్లికి గవర్నర్ గిరి త్వరలోనే తమిళనాడు గవర్నర్ గా నియమితులు కాబోతున్నారు. ఈ మధ్యే తమిళనాడు గవర్నర్ గా రోశయ్య  పదవీ కాలం ముగియడంతో ఆ స్థానంలో మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావు కి అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగింది. త్వరలోనే తమిళనాడు గవర్నర్ గా మోత్కుపల్లి నరసింహులు గారిని నియమించనున్నారని టిడిపి వర్గాల సమాచారం. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మోడీ తిరిగి రాగానే ఆదేశాలు వస్తాయని తెలుస్తుంది. ఇప్పటికే విద్యాసాగర్ రావు గవర్నర్ గా విధుల్లో ఉండగా మోత్కుపల్లి గవర్నర్ గిరి చేపడితే తెలంగాణ నుండి రెండవ వ్యక్తిగా నిలుస్తారు. 

తెరపైకి సిరిసిల్ల ,జనగాం జిల్లాలు ...!

తెరపైకి సిరిసిల్ల ,జనగాం జిల్లాలు ...!

తెలంగాణాలో 27జిల్లాలతో ముసాయిదా నోటిఫికేషన్ వెలువరించిన అనంతరం ఎగసిపడిన ప్రజా ఉద్యమాలతో చివరి నోటిఫికేషన్ లో మరికొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. 27జిల్లాల్లో సిరిసిల్లా ,జనగాం చేర్చాలని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు మొదలవడంతో కెసిఆర్ మరోమారు ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఇందులో కెసిఆర్ తనయుడు కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకోవడం,కెటిఆర్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో కెసిఆర్ పెద్దపెల్లి,హన్మకొండ జిల్లాల స్థానంలో సిరిసిల్ల ,జనగాం లను చేర్చనున్నట్లు తెలుస్తుంది.

Saturday, 3 September 2016

కెసిఆర్ "ఆపరేషన్ కాంగ్రెస్ వన్స్ మోర్" కారెక్కనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్???

కెసిఆర్ "ఆపరేషన్ కాంగ్రెస్ వన్స్ మోర్" 

కారెక్కనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్???

గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న ఆపరేషన్ ఆకర్ష్ కు  తెలంగాణాలో మళ్లీ తెరలేవనుంది. ఇప్పటికే ప్రతిపక్షాల ఉనికిని కోల్పోయేలా చేసిన కెసిఆర్ ఇక కూకటివేళ్లతో సహా పెకిలిస్తారేమో??? మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ని కారెక్కించే పని చాపకింది నీరులా సాగిపోతున్నట్టు సమాచారం. కృష్ణా పుష్కరాల సమయంలోనే సంపత్ కుమార్ కెసిఆర్ తో భేటీ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల సంపత్ పార్టీ వీడటం ఆగిపోయింది.రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసిన తరువాత సంపత్ కాంగ్రెస్ వీడి కారెక్కనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. సంపత్ తో పాటు మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. చర్చలు కొలిక్కివస్తే సంపత్ తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కారెక్కే అవకాశం ఉండనుంది.  

Friday, 2 September 2016

అన్నదాతను ఆదుకుందామిలా.....! తెలంగాణ నూతన వ్యవసాయవిదానం ఉండాలిలా ....

అన్నదాతను ఆదుకుందామిలా.....!

   తెలంగాణ నూతన వ్యవసాయవిదానం ఉండాలిలా .... 

దేశంలోనే వేగంగా అభివృద్ధి లో దూసుకుపోతున్న రాష్ట్రం తెలంగాణ,లక్ష కోట్ల ప్రాజెక్టులకు సైతం నెల రోజుల్లో అనుమతులు ఇచ్చేలా ప్రపంచంలోనే ప్రసిద్ధమైన నూతన ఏకగవాక్ష పారిశ్రామిక విదానం రూపొందించుకున్నాం,తెలంగాణాని ప్రపంచ విత్తన బండాగారం లా తీర్చిదిద్దాలని,తెలంగాణను కోటి ఎకరాల మాగాణంలా మార్చాలనే ఆశయంతో ముందుకు వెళుతున్నాం కానీ అన్నదాత ఇంకా నిరాశ కోరల్లోనే ఉన్నాడు... 
--తెలంగాణ పారిశ్రామిక విధానంతో క్షణాల్లో అనుమతులు 
--ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ కార్పోరేషన్ లు ఏర్పాటు చేసి,వేల కోట్ల నిదులు కేటాయిస్తున్నాం 
--ముఖ్యమంత్రి సహాయనిధి పేరిట ఎన్నోకోట్లతో  ఎంతోమంది  నిరుపేదల ప్రాణాలు నిలబెడుతున్నాం 
కానీ 
-అన్నదాతల రుణమాపీకి విడతల వారీగా ఇస్తూ సాగదీస్తూనే  ఉన్నాం 
-రైతుల ఇన్ ఫుట్ సబ్సిడీలకు ఎదురుచూపులే దిక్కు 
-అతివృష్టి ,అనావృష్టి వంటి కారణాలవల్ల పంటనష్టం వాటిల్లిన ప్రతిసారీ నష్టపరిహారం కోసం ఎదురుచూపులే 
-దేశంలో ఎంతోమంది గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉన్నా వారికి వ్యవసాయం కనుచూపుమేరలో కూడా ఉపాధిగా అనిపించక ఒకతరాన్ని సేద్యానికి దూరం చేశాం 
   ప్రస్తుతం ఉన్న ఈ  పరిస్థితుల్లో మార్పు రావటానికి అన్నదాత ను ఆదుకోవడానికి తెలంగాణ నూతన వ్యవసాయ విధానం అత్యావశ్యకం 

తెలంగాణ నూతన వ్యవసాయ విధానం :

--రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే  అవసరం లేకుండా తక్షణం రుణాలు అందేలా ఏకగవాక్ష విదానం 
-- రైతు యూనిట్ గా పంటల భీమా భీమా 
--తెలంగాణ రైతు కార్పొరేషన్ ,రైతులకు పంట నష్టపరిహారం,ఇన్ ఫుట్ సబ్సిడీ త్వరగా త్వరగా అందేలా రైతు సహాయ నిధి ఏర్పాటు 
--రైతులకు సేంద్రీయ సేద్యం పై అవగాహన కల్పించేలా వ్యవస్థ 
--దళారుల వ్యవస్థ రూపుమాపి రైతుల పంటలను మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వమే కొనుగోలు చేపట్టడం 
--రైతులకు తమ పంటలను నిలువ చేసుకునేందుకు అవసరమైన గోదాములను నిర్మించడం 
--వ్యవసాయం ,అనుబంధ రంగాలను ఒకే వ్యవస్థ కిందకు తెచ్చి రైతులు వాణిజ్య పంటల వైపు మారలేలా అవగాహన 
--వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంలా తీర్చిదిద్దడం 
--విత్తనోత్పత్తి రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడం 
--నిరుద్యోగ యువత వ్యవసాయం పై దృష్టి సారించేలా ప్రోత్సాహకాలు 

తెలంగాణ ప్రాజెక్టులకు నాబార్డ్ నిధులు

తెలంగాణ ప్రాజెక్టులకు నాబార్డ్ నిధులు 

   నాబార్డ్ తో ఒప్పందానికి ఉమాభారతి లేఖ 

కేంద్ర ప్రభుత్వం దేశంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల పూర్తికి ప్రధానమంత్రి  కృషి సించాయి యోజన పథకం కింద తెలంగాణలోని దేవాదుల ,కొమురం భీం,గొల్లవాగు,,మత్తడివాగు,భీమా ఎత్తిపోతల సహా 11పథకాలకు నాబార్డు కింద నిధులు ఇవ్వడానికి అంగీకారం తెలిపిన కేంద్రం ఇందుకు సంబంధించి ఒప్పందం చేసుకోవడానికి కేంద్రమంత్రి ఉమాభారతి తెలంగాణ నీటిపారుదల శాఖ మాత్యులు హరీష్ రావు కి లేఖ రాసింది. తెలంగాణలోని 11 ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిన నేపద్యంలో నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల వారీగా పనుల పురోగతి,భూసేకరణ,నిర్వాసితులకు చెల్లింపులు వంటి సమస్యలపై దృష్టి సారించింది. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన కింద తెలంగాణ లోని 11 ప్రాజెక్టుల పూర్తికి 5325 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనావేసింది. 

Thursday, 1 September 2016

చంద్రబాబు తొండాట....!

చంద్రబాబు తొండాట....!

ఓటుకు నోటు దర్యాప్తు ఆపాలని హైకోర్టులో పిటీషన్ 

మచ్చ లేని చంద్రుడిని అంటూ ఎల్లప్పుడూ ఊదరగొట్టే చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినా తిమ్మిని బమ్మి చేయడమే నా ధ్యేయం అన్న చందంగా మరోమారు తొండాటకు తెరలేపారు. నిన్న ఎసిబి కోర్టు ఓటుకు నోటు కేసు దర్యాప్తు నివేదికను ఈ నెల 29లోపు సమర్పించాలని ఆదేశించగా  ఆ ఆదేశాలను ఆపేయాలంటూ ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన తరుపు లాయరుచే హైకోర్టులో పిటీషన్ వేయగా  ఈ  పిటీషన్ పై రేపు వాదనలు విననుంది హైకోర్టు ధర్మాషణం. 

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ శుభవార్త 1032 పోస్టుల గ్రూప్-2 అనుబంధ నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ శుభవార్త 

1032 పోస్టుల గ్రూప్-2 అనుబంధ నోటిఫికేషన్ విడుదల 

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. 1032 పోస్టులతో గ్రూప్-2 అనుబంధ నోటిఫికేషన్ టిఎస్పిఎస్సీ  విడుదల చేసింది. గతంలో 439 పోస్టులకు గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల అవగా,ప్రస్తుతం వాటికి అదనంగా 593 పోస్టులు కలిపి  మొత్తం 1032 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసిన టిఎస్పిఎస్సీ ఈ నెల 3 నుండి 23 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఇది  వరకు గ్రూప్-2 కి  దరఖాస్తు చేసుకున్నవారు మరల దరఖాస్తు చేసుకోనక్కర్లేదు . ఈ గ్రూప్-2 పరీక్షను నవంబర్ 12,13 న నిర్వహించనున్నారు. 

Wednesday, 31 August 2016

153 నియోజకవర్గాల నయా తెలంగాణ...! నియోజకవర్గాల పెంపునకు కేంద్రం సుముఖం....?

153 నియోజకవర్గాల నయా తెలంగాణ...!

నియోజకవర్గాల పెంపునకు కేంద్రం సుముఖం....?

తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ పూర్తి చేస్తున్న కెసిఆర్ గారికి కేంద్ర అధికారవర్గాల నుండి మరో కీలక సమాచారం అందినట్టు తెలుస్తుంది. కేంద్ర అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజనకు సంబందించిన కసరత్తు మొదలవనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పది జిల్లాలు 119 నియోజకవర్గాల తెలంగాణ 27జిల్లాల 153 నియోజకవర్గాల తెలంగాణగా మారనుంది. 

Thursday, 18 August 2016

స్వర్ణ పతాక వేటలో సంచలన సింధూ సింహ గర్జన

స్వర్ణ పతాక వేటలో  సంచలన  సింధూ సింహ గర్జన


తను  ఓ  లేడీ శివంగి .... 
తను ఆడుతున్న కోర్టులో  చూపులు చురకత్తులు ... 
తన  సింహగర్జన  ప్రత్యర్థుల  గుండెల్లో  గునపాలు ... 
డ్రాగన్లను  మట్టికరిపిస్తూ ... జపాన్  జింకను  వేటాడి ... స్పెయిన్ బుల్ ని ఎదుర్కొని సంచలన  స్వర్ణ  సింహ గర్జన  చేస్తున్న 
తానే  రియో  రోరింగ్  సంచలన  సింధూ 120 కోట్ల మంది భారతీయుల ఆశల పల్లకి మోస్తూ ... 120 కోట్ల మంది భారతీయులు కోర్ట్  బయట ఇండియా... ఇండియా ... సిందూ ... సిందూ ... అంటూ  సింహ నాదాలు చేస్తుంటే ... కోర్టు లోపల కమాన్... కమాన్ ... అంటూ స్వర్ణ పతాక  వేటలో  సింహ గర్జన చేస్తూ ... జపాన్ షట్లర్ ఒకుహోరా కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండ రియో ఒలంపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీస్ లో  21-19,21-10 తో  సంచలన విజయం సాధించి ఫైనల్లో ప్రవెశించింది . 

Tuesday, 5 April 2016

రాష్ట్ర మంత్రివర్గం లోకి బిజేపి???;రాజకీయ సమీకరణాలు మార్చుతున్న కెసిఆర్???

రాష్ట్ర మంత్రివర్గం లోకి బిజేపి???;రాజకీయ సమీకరణాలు మార్చుతున్న కెసిఆర్???

తెలంగాణా రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్దమయ్యారు. ఇందులో బాగంగా తెలంగాణా మంత్రివర్గంలోకి బిజేపి ఎమ్మెల్యేలను తీసుకునేందుకు కెసిఆర్ సిద్దమయ్యారని తెలుస్తుంది. బిజేపి నుండి ఎమ్మెల్యే లక్ష్మన్,ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ల పేర్లను మంత్రివర్గం లోకి తీసుకునేందుకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలు దపాలుగా మోడీ తో చర్చలు జరిపిన కెసిఆర్ బిజేపితో దోస్తీకి రాష్ట్రం నుండే పునాది వేయాలని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణాలో టిడిపి తో పొత్తుతో నష్టమే అని భావిస్తున్న బిజేపి రాష్ట్ర నాయకత్వం కి టిఅరేస్ సరైన ప్రత్యామ్నాయమని కెసిఆర్ సంకేతాలు పంపుతున్నారు. కెసిఆర్ సంకేతాలతో రాష్ట్ర బిజేపి నాయకత్వం కూడా ఆ దిశగా చర్చలు సాగిస్తుంది. రాష్ట్ర మంత్రివర్గంలోకి బిజేపి ఎమ్మెల్యేలను తీసుకోగానే కేంద్రంలో టిఅరేస్ కి ఒక క్యాబినెట్,రెండు సహాయ మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. 


పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై కెసిఆర్ కి ప్రశంసల జల్లు

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై కెసిఆర్ కి ప్రశంసల జల్లు 



తెలంగాణా సాగునీటి ప్రాజెక్టుల పై ముఖ్యమంత్రి కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై ప్రశంసల జల్లు కురుస్తుంది.కెసిఆర్ ప్రజెంటేషన్ ప్రపంచంలోనే ప్రథమం అనుకుంటా,అద్బుతం కెసిఆర్ ప్రజెంటేషన్ అని పారిన్ కరస్పాండెన్స్ క్లబ్ అధ్యక్షుడు కెసిఆర్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. భారతదేశం లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి డైనమిక్ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ముఖ్య అతిదిగా ఆహ్వానించడం సంతోష దాయకం. ఈ రకంగా మిమ్మల్ని ప్రపంచ మీడియాకి పరిచయం చేయబోతున్నాం,ఈ సందర్బంగా ఢిల్లీ లో తమ సంస్థ సభ్యులకు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు,సంక్షేమ పథకాలు,తెలంగాణా ప్రభుత్వం తక్కువ సమయంలో సాదించిన విజయాలపై ప్రజెంటేషన్ ఇవ్వాలని సంస్థ అధ్యక్షుడు వెంకట నారాయణ లేఖలో పేర్కొన్నారు,1958లో ఏర్పడిన ఈ సంస్థలో దక్షిణాసియా దేశాలకు  చెందిన ప్రముఖ వార్త పత్రికలు,మీడియా చానళ్లు,మ్యగజిన్లు లకు చెందిన 500మంది ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. 

తెలంగాణా ఐటీ పాలసీ తొలి రోజు లక్ష్య సాధన

ఒక్కరోజు 25సంస్థలు,2,700కోట్ల పెట్టుబడులు 27000ఉద్యోగాలు 

తెలంగాణా ఐటీ పాలసీ తొలి రోజు లక్ష్య సాధన

పల్లెకు ప్రపంచానికి వారధిలా ఉన్న తెలంగాణా ఐటీ పాలసీ తొలి రోజే 25ప్రముఖ సంస్థలతో ప్రభుత్వం ఎంవోయు కుదుర్చుకుంది. ఐటీ పాలసీ ప్రకటించిన తొలి రోజే యెస్ బ్యాంక్,హెచ్పీఈ,టిఐఈ,ఇన్సైడ్ వ్యూ,టాలెంట్ స్ప్రింట్,సిస్కో,సాప్ ఎడ్యుకేషన్,మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేషన్,సీ-డాక్,యునివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్,ఐసీఐసీఐ ఫౌండేషన్ వంటి 25సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోగా,ఇందులో బాగంగా 2,700కోట్ల పెట్టుబడులు రానుండగా,27500మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ప్రకటించిన తొలి రోజే తెలంగాణా ఐటీ పాలసీ లక్ష్య సాదన దిశగా ముందడుగు పడింది. 


పల్లెకు ప్రపంచానికి వారధి 'తెలంగాణా ఐటి పాలసీ'

పల్లెకు ప్రపంచానికి వారధి 'తెలంగాణా ఐటి పాలసీ' 

ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం తో ప్రపంచ వ్యాపార దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తున్న తెలంగాణా నిన్న ప్రపంచ అత్యుత్తమ ఐటి పాలసీ ని అతిరథుల సమక్షంలో నిన్న ఆవిష్కరించారు. నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు వి.కె సారస్వత్,ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి,ముఖ్యమంత్రి కెసిఆర్,డిప్యుటీ సిఎం కడియం శ్రీహరి,మంత్రులు నాయిని,తారకరామారావు,తెలంగాణా ప్రభుత్వ అధికారులు పాల్గొనగా తెలంగాణా ఐటి పాలసీ లో బాగంగా మరో నాలుగు సబ్ పాలసీలను ఆవిష్కరించారు.తెలంగాణా ఐటీ పాలసీ తో పాటు తెలంగాణా ఇన్నోవేషన్ పాలసీ ,రూరల్ టెక్ పాలసీ,ఎలక్ట్రానిక్ పాలసీ,ఇమేజ్ అండ్ గేమింగ్ పాలసీలను ఆవిష్కరించారు. తెలంగాణా ఐటీ పాలసీ పల్లెకు ప్రపంచానికి వారధిలా ఉందని కార్యక్రమానికి హాజరైన ఐటీ నిపుణులు పేర్కొన్నారు.  ఇందులో బాగంగా కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం చిత్తసుద్దితో పనిచేస్తుందని,ప్రపంచ అత్యుత్తమ పారిశ్రామిక విధానంతో 8నెలల కాలంలోనే 1691కంపెనీలకు దరఖాస్తు చేసుకున్న 15రోజుల్లోనే అనుమతులు ఇచ్చామని,అన్నివిధాల తెలంగాణా ఐటి పెట్టుబడులకు అనుకూలం అని కెసిఆర్ పేర్కొనగా,నారాయణ మూర్తి దేశం లోని ప్రతి పట్టణం ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదేశాలతో పోటీ పడాలని,ప్రతి నిర్ణయం పారదర్శకంగా,వేగంగా,ఓపెన్ మైండ్ తో ఉండాలని సూచించారు. 

Thursday, 31 March 2016

అద్బుతం అద్వితీయం అపర భగీరథుడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్

అద్బుతం అద్వితీయం అపర భగీరథుడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 


ఆరు దశాబ్దాల అన్యాయాన్ని కడిగేస్తూ తెలంగాణా కర్షకుల సాగునీటి కష్టాలను తీర్చేలా కర్షకులకు సాగుపై ఆశను పెంచేలా తెలంగాణాలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో గోదావరి,కృష్ణమ్మ ల నీళ్లను తెలంగాణా బీడు భూములకు మరల్చి తెలంగాణాను సస్యశ్యామల హరిత తెలంగాణాల,అన్నపూర్ణలా మార్చేలా తెలంగాణా ప్రాజెక్టుల రీడిజైన్ సామాన్యులకు సైతం సులభంగా అర్ధం అయ్యేలా సవివరంగా వివరించారు ముఖ్యమంత్రి కెసిఆర్. 
1956నాటికే తెలంగాణాలో సాగునీటి విస్తీర్ణం 20లక్షల ఎకరాలు,అప్పటికే ప్రపంచంలోనే ప్రఖ్యాత మేజర్ సాగునీటి ప్రాజెక్టు నిజాం సాగర్,వాటర్ షెడ్ పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన కాకతీయ,రెడ్డి రాజులే అలాంటి పరిస్థితులతో సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణాలో ఈ ఆరు దశాబ్దాల ఆంధ్రా పాలకుల ఆదరణకు నోచుకోక దగాపడ్డ తెలంగాణా సాగునీటి ప్రాజెక్టుల కథ 'రాస్తే రామాయణం-మాట్లాడితే మహాభారతం' అంటూ మొదలెట్టిన కెసిఆర్ ప్రజెంటేషన్ దుమ్ముగూడెం,ప్రాణహిత-చేవెళ్ల,పాలమూరు,తుమ్మిడిహెట్టి ఇలా తెలంగాణాలోని ప్రాజెక్టు ఏదైనా ఆంధ్ర పాలకుల నిరంకుశ దోరనితో ప్రతి ప్రాజెక్టు డిజైన్ తెలంగాణాకి ప్రయోజనం లేకుండా,పక్క రాష్ట్రాలతో జల వివాదాలు వచ్చేలా,పర్యావరణ కొర్రీలు మొదలయ్యేలా చేసిన తీరు సుస్పష్టంగా వివరించిన కెసిఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ తో తెలంగాణా లో కోటి ఎకరాలకు సాగునీరు ఎలా ఇవ్వబోతున్నారో వివరించారు. 
ఖమ్మం జిల్లా తో మొదలెట్టిన కెసిఆర్ ఇందిరా,రాజీవ్ సాగర్ కాలువలకు రీడిజైన్ చేసి,దేవాదుల ప్రాజెక్టు ద్వారా కంతనపల్లి ప్రాజెక్టు రిడిజైన్ చేసి స్థలం తుపాకుల గూడెం కొత్తూరు వద్ద ప్రాజెక్టుతో అంతరాష్ట్ర జలవివాదాలు లేకుండా ఖమ్మం జిల్లాలో 6,20000ఎకరాలకు సాగునీరు అందించాలని సంకల్పంతో ఉన్నామని,దుమ్ముగూడెం నుండి 60టిఎంసీ నీళ్లు తీసుకుని 19టిఎంసి సామర్ధ్యంతో రోల్లపాడు ప్రాజెక్టుతో వరంగల్ కి 6లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. పాలమూరుకు కల్వకుర్తి ద్వారా వచ్చే సీజన్ నాటికే లక్షా 50వేల ఎకరాల కు సాగునీరు,జోన్నలబోడ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ తో పూర్తిస్థాయిలో 3లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తూ ,భీమా ,నెట్టెంపాడు ఎత్తిపోతల ,ఆర్దిఎస్ దిగువ భాగాన్ని తుమ్మల లిఫ్ట్ తో,పాలమూరు ఎత్తి పోతలలో బాగంగా శ్రీశైలం రిజర్వాయర్ -కల్వకుర్తి లిఫ్ట్-ఎల్లూరు లిఫ్ట్-నార్లాపూర్ ప్రాజెక్టు-ఏదుల రిజర్వాయర్-ఎట్టెం రిజర్వాయర్-కరివేర-ఉద్దండాపూర్రిజర్వాయర్-కొండుడుకు లక్షిమిదేవి పల్లి రిజర్వాయర్-అనంతారం రిజర్వాయర్ లతో పాలమూరును సస్యశ్యామలం చేయనున్నామని వివరించారు. నల్గొండ జిల్లాకు ఉదయసముద్రం బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు,దిండి రిజర్వాయర్ తో నిజామాబాద్ నుండి గ్రావిటీతో నల్గొండ లోని మునుగోడు,దేవరకొండ లకు నీల్లిస్తూ,చుటుప్పాల్ వరకు నీటిని తీసుకెళ్ళి 20 టిఎంసి లతో హైదరాబాద్ కి తాగునీటి అవసరాలకు ఒక రిజర్వాయర్ నిర్మించనున్నామని తెలిపారు. 
తెలంగాణా కాశ్మీర్ గా పేరుగాంచిన ఆదిలాబాద్ ని సస్యశ్యామలం చేసేందుకు ఆరు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులైన రోలివాగు,మత్తడివాగు,నీల్వాయి,జగన్నాత్పూర్,కొమురం భీం ప్రాజెక్టులు,సదరం మాటు బ్యారేజీ ద్వార ఆదిలాబాద్ కి సాగునీటి కష్టాలు తీరుస్తామని ,గంగనాల ప్రాజెక్టు ద్వార కోరుట్ల కు,కడెంపై 6.5టిఎంసి సామర్ధ్యంతో కుట్టెం రిజర్వాయర్ తో ఇచ్చోడ,బోథ్ ప్రాంతాలకు సాగునీరు అందించనున్నామని,50ఏళ్ల నిరీక్షణ అయిన లోయర్ పెన్ గంగా ప్రాజెక్టు కు మహారాష్ట్ర అభ్యంతరం తెలుపుతున్నందున చనఖ-కొరటా బ్యారేజీ ద్వారా 52వేల ఎకరాలకు సాగునీరు,బాసర వద్ద చెక్ డ్యాం,ప్రాణహిత-చేవెళ్ల కి బదులు తుమ్మిదిహెట్టి వద్ద 148మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి1651 టిఎంసి ల లభ్యత ఉండే కాళేశ్వరం (మేడిగడ్డ)బ్యారేజీ ఇందులో బాగంగా అన్నారం(3.6),చెందుల్ల బ్యారేజీ(5),మేడారం(3)మల్కపేట్(3.5),అనంతగిరి(3.5),హిమామ్ బాద్(0.8),మల్లన్న సాగర్(50)పాముల పర్తి(21),బస్వాపూర్(14),ఆలేరు(10),గుజ్జి(1.5),తల మట్ల (5)తమ్మక్కపల్లి (3),కాచాపూర్ (2.5)కామారెడ్డి(2.5),మంచిప్ప(5),షామీర్ పేట్ 20 టిఎంసి సామర్ధ్యం తో రిజర్వాయర్లతో కరీంనగర్,మెదక్,నిజామాబాద్,రంగారెడ్డి లకు సాగునీరు అందించనున్నామని,రాయపట్నం వంతెన నిర్మాణం అనంతరం ఎల్లంపెల్లి ప్రాజెక్టు పూర్తి అయినందున బ్యాక్ వాటర్ తో ఎల్లంపెల్లి-ధర్మపురి-జైన వరకు నిత్యం నీరు నిల్వ ఉండనుంది,ఎల్లంపెల్లి నుండి నీటిని లిఫ్ట్ తో మిడ్ మానేరు-మల్లన్న సాగర్-సింగూరు-నిజాం సాగర్-ఎస్సారెస్పీ నీటిని లిఫ్ట్ తో నిజామాబాద్,కరీంనగర్,వరంగల్ సస్యశ్యామలం కానుందని ప్రాజెక్టుల రిడిజైన్ తో ఆరు నూరైన ఎవరు అడ్డొచ్చిన కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతామని ప్రకటించారు.  


దేశం ఇంత దరిద్రపు పరిస్థితుల్లోకి దిగజారిపోయిందా....!

దేశం ఇంత దరిద్రపు పరిస్థితుల్లోకి దిగజారిపోయిందా....!

దేశం లో ప్రతిదీ కులం,మతం,దనిక,పేద గా విడదీస్తూ నీచరాజకీయాలకు పాల్పడుతున్న పాలకులు ఇప్పుడు దేశ ప్రతిష్టాత్మక అవార్డులకు సైతం కుల కళంకం అంటగట్టటానికి పూనుకోవడం చాల విచారకరం. అవార్డులలో వెనుకబడిన వర్గాలకు చోటు లేకపోవడం విచారకరమే కానీ ఇలా దేశ ప్రతిష్టను పెంచిన నిష్ణాతులను అవార్డుకు ఎంపిక చేసిన తరువాత వారిని కులాల వారిగా విడదీయడం ఎంత వరకు సమంజసం. అవార్డులకు ఇప్పటికే రాజకీయ రంగు పులిమిన నాయకులు ఇప్పుడు కులం రంగు పులమడం ఈ దేశం ఎంత దరిద్రపు పరిస్థితుల్లోకి దిగజారిపోయిందో తెలుస్తుంది. 

చారిత్రాత్మకం చంద్రశేఖరుడి నిర్ణయం అసెంబ్లీ లో నేడే చంద్రశేఖరుడి పవర్ పాయింట్ ప్రజంటేషన్

చారిత్రాత్మకం చంద్రశేఖరుడి నిర్ణయం 

అసెంబ్లీ లో నేడే చంద్రశేఖరుడి పవర్ పాయింట్ ప్రజంటేషన్ 

సామాన్యుడికి సైతం సాగునీటి వ్యవస్థ అర్ధమయ్యేలా... సాగునీటి నిపుణులు సైతం శబాష్ అనేలా... పుడమితల్లి పులకించిపొయెలా... చారిత్రాత్మక రీతిలో ఓ కొత్త సాంప్రదాయానికి తెర తీస్తూ ఓ ఉద్యమ సారధి ,స్వరాష్ట్ర సారధి,తెలంగాణా రథ సారధి,తెలంగాణా పెద్ద రైతు తెలంగాణా అసెంబ్లీలో గత ప్రభుత్వాలు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులలోని లోటుపాట్లు ,తెలంగాణా కి ఉపయోగపడని రీతిలో డిజైన్ చేసిన సాగునీటి ప్రాజెక్టులు,తెలంగాణా ప్రభుత్వం ఏర్పడ్డాక చేపట్టిన రిడిజైన్ వల్ల ఉపయోగాలు,తెలంగాణా ప్రాంతంలో గోదావరి,కృష్ణా నదుల నీటి లభ్యత,నీటిని ఏవిదంగా వాడుకుని తెలంగాణాని సస్యస్యామలం చేయాలి,తెలంగాణాలోని కోటి ఎకరాలకు ఏవిధంగా సాగునీటిని అందివ్వనున్నారు కూలంకషంగా క్షుణ్ణంగా క్లియర్గా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 

Wednesday, 30 March 2016

హైదరాబాద్ వేవ్ రాక్ లో అమెజాన్ క్యాంపస్ కి శంకుస్థాపన

హైదరాబాద్ వేవ్ రాక్ లో అమెజాన్ క్యాంపస్ కి శంకుస్థాపన

హైదరాబాద్ వేవ్ రాక్ లో అమేజాన్ క్యాంపస్ కి మంత్రి కేటిఅర్ చేతులమీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అమెరికా బయట అతిపెద్ద అమేజాన్ క్యాంపస్ హైదరాబాద్ లోనే కావడం దీని ప్రత్యేకత 2019కల్లా దీని నిర్మాణం పూర్తి కానుంది. పది ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ క్యాంపస్ నిర్మాణం పూర్తయితే 10000మందికిపైగా ఉపాధి దొరకనుంది. 

భానుడి భగభగలు... దంచుతున్న ఎండలు...

భానుడి భగభగలు... దంచుతున్న ఎండలు... 

తెలంగాణా పై భానుడి ప్రతాపం కొనసాగుతుంది,భానుడి భగభగలతో ఎండలు దంచుతుంటే పగటి పూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతూ రాబోతున్న మండే ఎండాకాల నెలలపై ఉహాలకు అందని భయాన్ని పెంచుతుంది. ఈరోజు తెలంగాణా వ్యాప్తంగా నిజామాబాద్ 41.1,ఆదిలాబాద్ 40.3,మెదక్ 40,రామగుండం 39.6,వరంగల్ 39.8,నల్గొండ39,బద్రాచలం 38.8,మహబూబ్ నగర్ 38.7,ఖమ్మం 38.2,హైదరాబాద్ 38.5,హాకీంపేట్ 37.4 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతతో ఉపాధి కూలీలు,విద్యార్థులు,ఉద్యోగులు,ప్రజలు భయటకి వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. 

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాడు ఆ మంత్రిని కొట్టాడట....! అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైన చంద్రబాబు తీరు

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాడు ఆ మంత్రిని కొట్టాడట....!

అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైన చంద్రబాబు తీరు 

నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు పెత్తనం సహచర మంత్రులపై ఎలా ఉండేదో ఈరోజు అసెంబ్లీలో బయటపెట్టారు మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి. తెలంగాణాలో కరువు పరిస్థితులపై చర్చ సందర్బంగా జరిగిన చర్చలో 'నాడు నిజాం షుగర్ ప్యాక్టరీ ప్రైవేటీకరణకు ముందు కమిటీ సభ్యులు,అధికారులు,మంత్రులతో చంద్రబాబు సమావేశమైనప్పుడు నేను షుగర్ ప్యాక్టరీని ప్రైవేటీకరణను వద్దని చేతులు ఎత్తి వేడుకుంటూ బతిమాలితే అసహనానికి గురైన చంద్రబాబు నా తొడపై కొట్టారని తోడంత ఎర్రగా కందిపోయింది,సమావేశ అనంతరం చంద్రబాబు తనని మరల పిలిపించుకుని  క్షమించమని అంటే మీరు కొట్టిన దెబ్బ నా తొడపై కాదు నా గుండెపై తగిలిందని చంద్రబాబు తో అన్నా నిజాం షుగర్ ప్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపలేదు అలా ఉండేది ఆనాడు ముఖ్యమంత్రి తీరు మంత్రులపై'అని నాటి పరిస్థితులను ,చంద్రబాబు తీరును బయటపెట్టారు మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి. 

ఐటీ విస్తరణకు కెసిఆర్ కి విన్నపం

       ఐటీ విస్తరణకు కెసిఆర్ కి విన్నపం 


తెలంగాణా పారిశ్రామిక విధానం టిఎస్-ఐపాస్ తో ఎనిమిది నెలల సమయంలోనే ప్రపంచం ద్రుష్టి తెలంగాణా వైపు తిప్పి 30000కోట్ల విదేశీ పెట్టుబడులను రప్పించిన తెలంగాణా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ప్రపంచ అత్యుత్తమ ఐటీ విధానం ఏప్రిల్ 4న ఐటీ దిగ్గజాల నడుమ ప్రపంచానికి ప్రకటించనుంది.ప్రపంచ ఐటీ కేంద్రంగా తెలంగాణాను నిలపాలనే దృడ నిశ్చయంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి విజ్ఞప్తి ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా విస్తరించి ఉన్న ఐటీ రంగాన్ని తెలంగాణాలోని కరీంనగర్,వరంగల్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేలా చర్యలు తీసుకోవాలి,హైదరాబాద్ లో నిర్మించిన అంకుర కేంద్రం 'టి-హబ్' రెండో కేంద్రాన్ని హైదరాబాద్ బయట ఏర్పాటు చేయాలి. నిజామాబాద్,కరీంనగర్,వరంగల్ లో ఐటీ పరిశ్రమల విస్తరణకు రాయితీలు,మౌలిక వసతులను,పెట్టుబడి రాయితీలు కల్పించాలి.ఇన్ఫోసిస్,టెక్ మహీంద్రా వంటి స్వదేశీ ఐటీ దిగ్గజాలతో, బిపీవో కాల్ సెంటర్లు,ఎంఎన్సీ లతో తెలంగాణా లోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ డ్రైవ్ లు నిర్వహించాలని,ఐటి పాలసీలో తెలంగాణా ద్వితీయ శ్రేణి నగరాలకు ప్రత్యేక స్థానం కల్పించాలని కోరుతూ తెలంగాణా పునర్నిర్మాణానికి  అంకుటిత దీక్షతో ముందుకేల్తున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ మీ శ్రేయోభిలాషులు.        
---వేముల కర్ణాకర్ రెడ్డి (తీగెల ధర్మారం,ధర్మపురి,కరీంనగర్)

చంద్రబాబు చంద్రశేఖరుడికి భయపడుతున్నాడా???

చంద్రబాబు చంద్రశేఖరుడికి భయపడుతున్నాడా???

నిన్న ఆంధ్ర అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చ సందర్భంగా ఆసక్తికర వాఖ్యలు చోటు చేసుకున్నాయి చర్చలో ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతూ 'తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణా ప్రయోజనాల కోసం పక్క రాష్ట్రం మహారాష్ట్ర తో జలవివాదాల పరిష్కారం కోసం చర్చలతో ఒప్పందాలు కుడుర్చుకుంటుంటే,కలిసి ఉన్న తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఆంధ్ర ముఖ్యమంత్రి మాత్రం చొరవ తీసుకునే ప్రయత్నం చెయ్యట్లేదు సరికదా తెలంగాణా ముఖ్యమంత్రితో చర్చలకు వెలితే ఎక్కడ ఓటుకు నోటుకు కేసును తిరగేస్తాడెమో అని చంద్రబాబు భయపడుతున్నారని వాఖ్యానించగా అందుకు స్పందనగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి వారం కోర్టుల చుట్టూ తిరుగుతుంది ఎవరో??భయపడేదేవరో??అని వాఖ్యానించారు. 

కేంద్ర మంత్రులతో మంతనాలు జరుపుతున్న యువరాజు

కేంద్ర మంత్రులతో మంతనాలు జరుపుతున్న యువరాజు 

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన యువ మంత్రి కేటిఅర్ నిన్న కేంద్ర మంత్రులతో బిజీ బిజీగా మంతనాలు జరిపారు విబజన చట్టంలోని హామీలు,తెలంగాణాకి అభివృద్ధి నిధులు,మరికొన్ని పనులపై కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్,వెంకయ్య నాయిడు,బీరేంద్ర సింగ్ లతో బేటీ అయ్యారు. తొలుత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో బేటీ అయిన కేటిఅర్ తెలంగాణా సర్కార్ జిల్లాలు,మండలాల పునర్వ్యవస్తీకరణ చేపట్టనున్న నేపధ్యంలో విభజన చట్టంలో పేర్కొన్న హామీ ప్రకారం నియోజకవర్గాల పెంపు త్వరగా చేపట్టాలని,ఐపిఎస్ ,ఐఎఎస్ ల కొరత దృష్ట్యా నియమాకాలు జరిపి తెలంగాణాకి ఐపిఎస్ లను 141కి పెంచాలని విజ్ఞప్తి చేసారు. అనంతరం గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ తో సమావేశమైన కేటిఅర్ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులతో అనుసంధానం చేయాలని పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణాను పరిగణలోకి తీసుకోవాలని కోరిన కేటిఅర్ తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ బగీరథ పనులను పరిశీలించటానికి మంత్రి గారిని ఆహ్వానించారు,అలాగే తెలంగాణకు సంబంధించి 3వేల కోట్ల అభివృద్ధి పనులకు ,172రోడ్డు అనుసందాన వంతేనలకు 500కోట్లు కేటాయించాలని కోరారు. 

నేడో రేపో 1000పోస్టులతో గ్రూప్-2 రీనోటిఫికేషన్???

నేడో రేపో 1000పోస్టులతో గ్రూప్-2 రీనోటిఫికేషన్???

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో వాయిదా పడ్డ గ్రూప్-2పరీక్ష కు రీనోటిఫికేషణ్ వేయటానికి టిఎస్పిఎస్సి సిద్దమవుతుంది. గ్రూప్-2స్థాయి ఖాళీలను గుర్తించిన అధికారులు ముఖ్యమంత్రికి సమాచారం అందించడంతో 1000పోస్టుల తో నేడో రేపో గ్రూప్-2కి రీనోటిఫికేషన్ ఇవ్వనున్నారు. గతంలో 500పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్ కి 5లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఆదేశాలతో పోస్టులను పెంచుతూ వెలువడనున్న గ్రూప్-2నోటిఫికేషన్ కోసం లక్షలాది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

డిఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త;రెండు రోజుల్లో షెడ్యుల్డ్???

డిఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త;రెండు రోజుల్లో షెడ్యుల్డ్???

తెలంగాణాలో డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది నిరుద్యోగులకు శుభవార్త. ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యాశాఖ రెండు,మూడు రోజుల్లో డిఎస్సీ షెడ్యుల్డ్ విడుదల చేయటానికి సన్నాహకాలు చేస్తుంది. వారం క్రితం విడుదలైన టెట్ కి 3లక్షలకు పైగా దరకాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15,000టీచర్ పోస్టుల బర్తీకి షెడ్యుల్డ్ విడుదల చేయనుంది. ఇప్పటికే డిఎస్సీ ఫైల్ ముఖ్యమంత్రి వద్దకు చేరింది,నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి సైతం ప్రకటన చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Tuesday, 29 March 2016

ఉద్యమ చరిత్ర ప్రస్పుటించేలా 'తెలంగాణా స్మారక కేంద్రం'???

ఉద్యమ చరిత్ర ప్రస్పుటించేలా 'తెలంగాణా స్మారక కేంద్రం'??? 

అరవై ఏండ్ల తెలంగాణా ఉద్యమ చరిత్ర,తెలంగాణా పూర్వ చరిత్ర ,తెలంగాణా సాంస్కృతిక వారసత్వం,సంప్రదాయాలు ఒకే చోట కళ్లకు కట్టినట్టు ప్రస్పుతించేలా 'తెలంగాణా స్మారక కేంద్రం' నిర్మించాలని కెసిఆర్ యోచిస్తున్నారు. తెలంగాణా తొలితరం ఉద్యమ అమరవీరుడు బద్రివిశాల్ పన్నాలాల్ 88వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ 1969తెలంగాణా ఉద్యమం మొదలు 2009మలి దశ ఉద్యమం ,తెలంగాణా రాష్ట్ర సాధన వరకు తెలంగాణా చరిత్రలోని కీలక ఘట్టాలు,అమరవీరుల త్యాగాలు,తెలంగాణా సంస్కృతి,చరిత్ర ఒకే చోటే ఉండేలా తెలంగాణా నడిబొడ్డున 'తెలంగాణా స్మారక కేంద్రం' ఏర్పాటు చేస్తామని,ఇందుకు సంబందించిన మరిన్ని విషయాలను అధికారులతో చర్చించి వెల్లడిస్తానని కెసిఆర్ ప్రకటించారు. 

నరేంద్ర-చంద్రుల మధ్య చంద్రశేఖరుడు

నరేంద్ర-చంద్రుల మధ్య చంద్రశేఖరుడు 

2014ఎన్నికల ముందు కేంద్రంలో మోడీ గాలి వీస్తుంటే తెలంగాణాలో కెసిఆర్ నామస్మరణ జరుగుతుంది అలాంటి సమయంలోనే ఆంధ్రలో మాత్రం జగన్ హవా అనుకుంటున్నారు కానీ ఈ పరిస్థితి మారాలంటే ఎలాగైనా మోడీ తో దోస్తీ తప్పనిసరి అని బిజేపీ రాష్ట్ర నాయకత్వం వద్దంటున్న చంద్రబాబు పట్టువదలని విక్రమార్కుడి ప్రయత్నం ,వెంకయ్య నాయిడి మధ్యవర్తిత్వం,చంద్రబాబు చతురతతో టిడిపి,బిజేపీ పొత్తు కుదిరింది వీరిరువురికి తోడు పవన్ జతకలవడంతో ఆంధ్రలో అధికార పీఠం ఎక్కారు చంద్రబాబు,ఈ పొత్తుతో బీజేపీకి ఒరిగేదేమీ లేకపోయినా పొత్తుల మిత్రదర్మం తో టిడిపికి కేంద్ర మంత్రివర్గంలో చోటిచ్చారు మోడీ ,ఆంధ్ర కి ఇచ్చిన హామీ ప్రకారం ఐఐటి,ఐఐఎమ్,ఐఐఐటి,ఐఐఎస్టి లాంటి కేంద్ర విద్యాసంస్థల నిర్మాణానికి నిధులు కుమ్మరించింది. మరెన్నో అభివ్రుద్ది నిధులను కేటాయించింది,కానీ చంద్రబాబు ఆడంబరాలు ,పబ్లిసిటీ స్టంట్స్,బాబు అండ్ కో అవినీతి తో నిధుల దుర్వినియోగం గ్రహించిన కేంద్ర సర్కార్ ప్రత్యేక ప్యాకేజీ విషయం పక్కన పెట్టింది. స్వయంగా చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోవడంతో తను కేంద్రం చేతిలో చిక్కాడు ఇదిలా ఉండగా మధ్యలోకి చంద్రశేఖర్ రావు ప్రవేశించాడు. కేంద్రానికి ఇప్పటికిప్పుడు కెసిఆర్ అవసరం లేకపోయినా బావిష్యత్తులో కచ్చితంగా అవసరం అవుతుంది. తెలంగాణా లో సంక్షేమ కార్యక్రమాలతో తిరుగులేని ప్రజాదారనతో ముందుకేల్తుంటే చంద్రబాబు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాడు. అందుకే కేంద్రం చంద్రబాబుని పొమ్మనలేక పోగాబెట్టలేక సహాయనిరాకరణ చేస్తూ చంద్రశేఖరునికి దగ్గరవుతూ ఆహ్వాన మాటల మంత్రాంగాలు కొనసాగిస్తూ ఉంది. 

తెలంగాణా కీర్తి కిరీటంలోకి మరో హైటెక్ టవర్స్;సైబర్ టవర్స్ ని తలదన్నేలా హైటెక్ టవర్స్

తెలంగాణా కీర్తి కిరీటంలోకి మరో హైటెక్ టవర్స్;సైబర్ టవర్స్ ని తలదన్నేలా హైటెక్ టవర్స్ 

తెలంగాణా ఐటీ పరిశ్రమను మరో మెట్టుకు ఎక్కించాలని ప్రయత్నిస్తున్న సర్కార్ తెలంగాణకే తలమానికంగా నిలిచిన సైబర్ టవర్స్ ని మించిన మరో హైటెక్ సిటీ నిర్మాణానికి తెలంగాణా సర్కార్ సిద్దమైంది ఏప్రిల్ 4న తెలంగాణా ఐటీ విధానాన్ని ప్రకటించనున్న సర్కార్ అందులో హైటెక్ సిటీ నిర్మాణానికి సంబందించిన వివరాలను తెలపనున్నారు. కార్పోరేట్ ప్రాంగణాలకు మిన్నంగా మౌలిక సదుపాయాలతో తెలంగాణాలోని 500చిన్న ఐటీ కంపెనీలకు ఉపయోగపడేలా ఈ టవర్స్ నిర్మించనుంది. అలాగే ప్రస్తుతం మాదాపూర్,గచ్చిబౌలి,నానక్ రామ్ గూడ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నఐటీ పరిశ్రమని ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మరో ఐటీ కారిడార్ విస్తరించనున్నట్లు తెలంగాణా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 4న ప్రకటించనున్న ఐటీ పాలసీలో 50లక్షల నుండి 5కోట్ల టర్నోవర్ ఉన్న చిన్న ఐటీ కంపెనీలకి రాయితీ కల్పించనుంది. 

Monday, 28 March 2016

తెలంగాణా వ్యాప్తంగా మరిన్ని షీ టీమ్స్

తెలంగాణా వ్యాప్తంగా మరిన్ని షీ టీమ్స్ 

ఈరోజు శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యే కొండా సురేఖ షీ టీం ల పనితీరు ,మరిన్ని షీ టీం లను ఏర్పాటు చేయాలని అడిగిన ప్రశ్నకు హోం మంత్రి నాయిని నరశింహ రెడ్డి సమాధానమిస్తూ ప్రస్తుతం తెలంగాణాలోని ప్రతి జిల్లా కేంద్రంలో రెండు షీ టీం లను ఏర్పాటు చేసామని ,షీ టీం ల ద్వారా ఈవ్ టీజింగ్ కి పాల్పడుతున్న వారిపై 315కేసులు నమోదు చేసామని ,172మందిని అరెస్టు చేసామని ,ఈవ్ టీజింగ్ కి పాల్పడుతున్న 2,400మందికి కౌన్సిలింగ్ ఇచ్చామని,పదే పదే ఈవ్ టీజింగులకు పాల్పడుతున్న వారిపై నిర్భయ కేసులు పెడుతున్నామని,త్వరలోనే తెలంగాణాలోని ప్రదాన నగరాలు,పట్టణాలలో షీ టీం లను ఏర్పాటు చేస్తున్నామని,కొండా సురేఖ తెలంగాణా వ్యాప్తంగా మహిళా పోలిస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని,ప్రతి స్టేషన్లలో మహిళా డేస్కులను ఏర్పాటు చేయాలని,షీ టీం లలో పనిచేస్తున్న వారికి ప్రోత్సాహకాలు అందించాలని అడగగా ఇందుకు మంత్రి నాయిని నరశింహ రెడ్డి సానుకూలంగా స్పందించారు. 

పోలిస్ కానిస్టేబుల్స్ రాత పరీక్ష ఏప్రిల్ 24

పోలిస్ కానిస్టేబుల్స్ రాత పరీక్ష ఏప్రిల్ 24

ఆర్ఆర్బి పరీక్ష  కారణంగా ఏప్రిల్ 3న జరగాల్సిన వాయిదా పడిన తెలంగాణా పోలిస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఏప్రిల్ 24న నిర్వహించాలని తెలంగాణా పోలిస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. పరీక్షను మధ్యాహ్నం 2నుండి 5వరకు నిర్వహించాలని ,ఈ నెల జరగాల్సిన ఎస్సై రాత పరీక్షను యదాతదంగా ఏప్రిల్ 17న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో వాయిదా పడ్డ గ్రూప్-2పరీక్ష పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. మరో రెండు మూడు రోజుల్లో టిఎస్పిఎస్సి బోర్డు సమావేశం నిర్వహించి గ్రూప్-2పరీక్షపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. 

తెలుగు చలనచిత్రాలకు 3జాతీయ అవార్డులు;బాహుబలికి రెండు ,కంచె సినిమాకి ఒకటి

తెలుగు చలనచిత్రాలకు 3జాతీయ అవార్డులు;బాహుబలికి రెండు ,కంచె సినిమాకి ఒకటి



ఈరోజు ప్రకటించిన 63వ జాతీయ అవార్డులలో తెలుగు సినిమాలకి మూడు అవార్డులు దక్కాయి. తెలుగు చలనచిత్ర స్థాయిని అంతర్జాతీయ స్థాయికి పెంచిన బాహుబలి సినిమాకి జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగ,ఇదే సినిమాకి ఉత్తమ సౌండ్ ఎఫెక్ట్స్ క్యాటగిరిలో అవార్డు గెలుచుకోగా, కంచె సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చలనచిత్ర క్యాటగిరీలో జాతీయ అవార్డు గెలుచు కుంది. జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న తొలి తెలుగు చిత్రంగా బాహుబలి నిలిచింది. ఎస్. ఎస్ . రాజమౌళి దర్షకత్వంలో రానా ,ప్రభాస్,అనుష్క,తమన్నా,రమ్యకృష్ణ ,నాజర్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కింది.గత ఏడాది రిలీజ్ అయిన బాహుబలి కలెక్షన్ల రికార్డులను దుమ్ముదులుపుతూ 600కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టగా,రెండో ప్రపంచ యుద్ధం నేపధ్యం లో క్రిష్ దర్షకత్వంలో వరుణ్ తేజ్ ,ప్రగ్యా జైస్వాల్  హీరో ,హీరోయిన్లు గా తెరకెక్కిన కంచె సినిమా విమర్షకుల ప్రశంసల తో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందింది. 

చంద్రబాబుకు మరో జలక్ తప్పదా???నేను సైతం అంటున్న రేవంత్ రెడ్డి???

చంద్రబాబుకు మరో జలక్ తప్పదా???నేను సైతం అంటున్న రేవంత్ రెడ్డి???

తెలంగాణాలో 2019లో అధికారం టిడిపి దే,నేనే ముఖ్యమంత్రి అంటూ కలలు కన్న రేవంత్ ఆశలు కలలుగానే మిగిల్చేలా తెలంగాణాలో టిడిపి పార్టీయే కనుమరుగై పోతుండటంతో ఏమి  తోచని పరిస్థితిలో పడిపోయాడు రేవంత్. ఇక టిడిపిలో ఉంటే రాజకీయ జీవితం అగమ్యగోచరమే అనుకుంటున్న రేవంత్ చంద్రబాబుని వదిలే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ మారటానికి సిద్దపడిన రేవంత్ జాతీయ పార్టీ అయిన బిజేపి,తెలంగాణా లో అధికార పార్టీ అయిన టిఅరేస్ నేతలతో తెరవెనుక మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో బాగంగానే ఎప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఫైర్ బ్రాండ్ లా వ్యవహరించే రేవంత్ ఈ సమావేశాల్లో కొంత స్పీడ్ తగ్గించాడు. టిడిపికి ప్రస్తుతం తెలంగాణాలో పెద్దదిక్కుగా ఉన్న రేవంత్ సైతం పార్టీ మారితే ఇక అంతే సంగతులు. 

ఉత్తమ జాతీయ చలనచిత్రం 'బాహుబలి' భళా బాహుబలి

ఉత్తమ జాతీయ చలనచిత్రం 'బాహుబలి' 

భళా బాహుబలి



తెలుగు చలన చిత్ర స్థాయిని అంతర్జాతీయ స్థాయికి చేర్చి రికార్డుల దుమ్ముదులిపిన దర్శక జక్కన రాజమౌళి చెక్కిన శిల్పం బాహుబలి 63వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ జాతీయ చలన చిత్రంగా ఎంపికైంది. ఈరోజు ప్రకటించిన జాతీయ అవార్డుల ప్రకటనలో బాహుబలి ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రంగా బాహుబలి రికార్డు కెక్కింది. 600కోట్ల రికార్డు కలెక్షన్లతో రికార్డుల దుమ్ము దులిపిన బాహుబలి ఉత్తమ చిత్రంగా ఎంపిక పట్ల తెలుగు సినీ పరిశ్రమ ఆనందం వ్యక్తం చేస్తుంది. రాజమౌళి దర్శకుడిగా ప్రభాస్ ,రానా,అనుష్క ,రమ్యకృష్ణ ,నాజర్ ,తమన్నా ప్రధాన తారాగణంగా తెరకెక్కిన బాహుబలి టీం ప్రస్తుతం భాహుబలి-2 చిత్రీకరణం లో ఉంది. 

చిక్కుల చంద్రుడు...! నరేంద్రుడు నిదులివ్వకపోవడానికి కారణం అదేనా???

చిక్కుల చంద్రుడు...!

నరేంద్రుడు నిదులివ్వకపోవడానికి కారణం అదేనా???

2014ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా,ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఉదరగోట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ అంటూ కొన్ని రోజులు మభ్యపెట్టాడు ,అనంతరం మరచిపోయాడు,ఇక ప్రత్యేక హోదా విషయమే మరిచాడు. కేంద్రం పై ఒత్తిడి పెంచుతాడానుకుంటే ఒత్తిడిలో చిత్తవుతున్నాడు. కేంద్రం కూడా చంద్రబాబు పనితీరును పరిశీలిస్తూనే ఉన్నారు. ఏపనైనా అట్టహాసం,పబ్లిసిటీ లేకుండా చేయని తత్వం,దుబారా ఖర్చు,కేంద్రం కేటాయించిన నిధులకు యుటిలైజేషన్ సర్టిపికెట్లు(నిధుల వినియోగ పత్రాలు) కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా పైగా కేంద్ర నిధుల పనుల్లో అవినీతికి తావిస్తూ నిధుల దుర్వినియోగం చేస్తున్నారని భావిస్తున్న కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం లేదని కేంద్ర వర్గాల సమాచారం. 

Sunday, 27 March 2016

విజయ విరాటపర్వం;సెమీస్ లో భారత్

విజయ విరాటపర్వం;సెమీస్ లో భారత్ 


          ఒత్తిడిలో విశ్వరూపం చూపించే విరాట్ కోహ్లి మరోమారు తన సూపర్ బ్యాటింగ్ తో ఇండియా ని సెమిస్ చేర్చాడు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20ఓవర్లలో 160పరుగులు చేసింది మొదట్లో ఖవాజ 16బంతుల్లో 26,ఫించ్ 34బంతుల్లో 43 పరుగులతో జోరుగా పరుగుల ప్రవాహం కొనసాగించగా ఆసిస్ 200స్కోర్ దాటేలా కనిపించినా పాండ్య 2/36,భూమ్ర 1/32,నెహ్రా 1/20 డెత్ ఓవర్లలో సూపర్ బౌలింగ్ తో ఆసీస్ ని కట్టడి చేసారు. 
           161పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మొదట్లో 49పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా కోహ్లి 51బంతుల్లో 82నాటౌట్ సూపర్ షో కి యువరాజ్ 21,ధోని 18నాటౌట్ అండగా నిలవడంతో భారత్ సూపర్ షో తో తొలుత కంగారుపడిన భారత్ చివరకు ఆసీస్ ని కంగారు పెట్టించి మరో అయిదు బంతులు మిగిలి ఉండగానే విజయం సాదించాడు. ఆసీస్ బౌలర్లో వాట్సన్ 2/23,నైల్ 1/33రాణించారు. 82పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 

మరోమారు చంద్రహాసం;జగన్ కు ఝంఝాటం

మరోమారు చంద్రహాసం;జగన్ కు ఝంఝాటం 

చంద్రబాబు ని ఇరుకున పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నా ఎట్టకేలకు మరోమారు చంద్రబాబు ఆకర్ష్ దరహాసం చేసాడు. వైసిపి ఎమ్మెల్యే పరువుల సుబ్బారావు పార్టీ వీడి టిడిపి లో చేరుతున్నట్లు ప్రకటించగా,మరో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు కూడా పార్టీ వీడటానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. పిఏసి చైర్మెన్ పదవి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న జ్యోతుల నెహ్రూ తో చెవిరెడ్డి మంతనాలు జరిపినా పలితం లేనట్టు తెలుస్తుంది,పార్టీ వీడటానికి సిద్దపడిన జ్యోతుల నెహ్రూ టిడిపి మంత్రులతో,టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ తో చర్చలు జరిపారు. ఈరోజు మధ్యాహ్నం తన అనుచరులతో సమావేశమైన నెహ్రూ పార్టీ వీడుతున్నట్లు అనుచరులకు తెలిపాడు. జ్యోతులతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారటానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. 

భాగ్యనగరం,ఇందూరులో భానుడి భగభగలు

భాగ్యనగరం,ఇందూరులో భానుడి భగభగలు 

తెలంగాణాలో రెండో రోజు సూర్య ప్రతాపంతో హైదరాబాద్ ,నిజామాబాద్ లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు తెలంగాణా వ్యాప్తంగా వడదెబ్బ తో అయిదుగురు మృత్యువాత పడ్డారు. ఈరోజు హైదరాబాద్,నిజామాబాద్ లో 41,మెదక్ లో 40,వరంగల్ లో 39,కరీంనగర్,ఖమ్మం 38,మహబూబ్ నగర్ ,రంగారెడ్డి ,నల్గొండ లో 37డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు రోజులనుండి విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రత లతో జనం విలవిలలాడుతున్నారు. 

చంద్రబాబుకు చుక్కలు...!ద్రవ్యవినిమయ బిల్లుపై విప్ జారీ చేస్తున్న వైసిపి

చంద్రబాబుకు చుక్కలు...!ద్రవ్యవినిమయ బిల్లుపై విప్ జారీ చేస్తున్న వైసిపి

ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ని మరో మారు ఇరకాటంలో పడేస్తున్నాడు ప్రతిపక్ష నేత జగన్. పార్టీ మారిన వైసిపి ఎమ్మెల్యేల పై వేటు పడేలా పగడ్బందీ ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ఈ నెల అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగే వోటింగ్ లో పాల్గొని ద్రవ్యవినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైసిపి విప్ జారీ చేసేందుకు సిద్దమైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు విప్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు జగన్. ఆరోజు అసెంబ్లీకి హాజరు కాకపోయినా పార్టీ విప్ దిక్కరించినట్టే అని ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇదివరకు రెండు సార్లు అవిశ్వాసం తో ఇరుకున పెట్టాలని చూసిన ప్రభుత్వం పార్టీ మారిన వారిని కాపాడిన ఈ సారి అలాంటి పరిస్థితి రాకుండా పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వేటే లక్ష్యంగా ముందుకు సాగుతూ చంద్రబాబుకి చుక్కలు చూపిస్తున్నారు ప్రతిపక్ష నేత జగన్. 

అపర భగీరథుడు సిద్దమవుతున్నాడు ప్రాజెక్టుల పవర్ పాయింట్ ప్రజంటేషన్ కి

అపర భగీరథుడు సిద్దమవుతున్నాడు ప్రాజెక్టుల పవర్ పాయింట్ ప్రజంటేషన్ కి

తెలంగాణా ముఖ్యమంత్రి అపర భగీరథుడు కెసిఆర్ ప్రాజెక్టుల రీడిజైన్  ,తెలంగాణా జలవిధానం పై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి సిద్దమవుతున్నాడు. విపక్షాల విమర్శలకి చెక్ పెట్టేలా,తెలంగాణా ప్రజలు గర్వపడేలా తెలంగాణా లోని 119నియోజకవర్గాల తాగు,సాగు నీటి ప్రాజెక్టుల రీడిజైన్,నీటి వనరులను సమర్ధవంతంగా ఎలా వాడుకోవాలో తెలిపేలా అసెంబ్లీలో ఈ నెల 31న కెసిఆర్ పూర్తి వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నాడు. ప్రాణహిత-చేవెళ్ల,కాళేశ్వరం,తుమ్మిడిహెట్టి,చనఖా-కోరాట,మేడిగడ్డ మొదలగు ప్రాజెక్టుల సమగ్ర స్వరూపం ఇంతకుముందు ప్రభుత్వాల డిజైన్ ,ప్రస్తుతం రీడిజైన్ అనంతరం ప్రయోజనాలు ,ఏ ప్రాజెక్టు నుండి ఎన్ని నియోజకవర్గాలకు సాగునీరు అందించాలి ,కోటి ఎకరాలకు సాగునీరు ఏ విధంగా అందబోతుంది సభలో సమగ్రంగా వివరించానున్నాడు. 

నలుగుతున్నాడు చంద్రబాబు జగన్మోహన చంద్రశేఖరుల మద్యలో

నలుగుతున్నాడు చంద్రబాబు జగన్మోహన చంద్రశేఖరుల మద్యలో 

ఒకప్పుడు ఎన్డియే సారధి,తొమ్మిది రెండు టర్ములు వరసగా అఖండ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యూహాల్లో దిట్ట,మామను గద్దె దించి సింహాసనం అధిష్టించిన నేర్పరి అలాంటి చంద్రబాబు రాష్ట్ర విబజన అనంతరం ఆంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా అధికారం చేతిలో ఉన్నా పొరుగు రాష్ట్రం ,సొంత రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి మధ్యలో నలిగిపోతున్నాడు. ఓ వైపు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ,మరో వైపు జగన్ వ్యూహాల చక్రంలో ఇరుక్కుని సతమతమవుతున్నాడు.తెలంగాణా లో 15మంది ఎమ్మెల్యేలతో ఉన్న పార్టీ టిఅరేస్ ఆకర్షణలో పడి ముగ్గురికి చేరుకుంది. ఇంకా తెరవెనుక సన్నాహకాలు,సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణాలో భూస్థాపితమైన టిడిపి నామరూపాల్లేకుండా పోయే పరిస్థితి,ఇక ఆంధ్రలో అమరావతి భూదందా,మంత్రుల తీరు,వైసిపి నుండి జంపింగులు జరుగుతున్నా అవసరమైన మెజారిటీ జంపిగులు లేకపోవడంతో జగన్ వ్యూహాలతో సతమతం ,రోజా విషయంలో కేంద్రం నుంచి క్లాస్,పూర్తిగా సమసిపోని ఓటుకు నోటు ఇలా ప్రతిది మెడకి చుట్టుకుంటూ ఉండటంతో చంద్రబాబు జగన్ చంద్రశేఖరుల వ్యూహాల మధ్య నలిగిపోతున్నాడు. 

Saturday, 26 March 2016

తెలంగాణాలో భానుడి భగభగలు;ఒక్కరోజే అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రత

తెలంగాణాలో భానుడి భగభగలు;ఒక్కరోజే అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రత 

ఈసారి తెలంగాణాలో సమ్మర్ భగభగలు ముందే ప్రారంబమయ్యాయి. ఈరోజు తెలంగాణా వ్యాప్తంగా అకస్మాత్తుగా పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. భానుడి ప్రతాపంతో ఈరోజు తెలంగాణా వ్యాప్తంగా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు మెదక్ లో 41.5,నిజామాబాద్ లో 41.4,హన్మకొండలో 40.5,ఆదిలాబాద్ 40.8,మహబూబ్ నగర్ 40.3,బద్రాచలం 39,రామగుండం 39,హైదరాబాద్ 39,నల్గొండ 38.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్కసారిగా పెరిగిన పగటి పూట వేడితో జనం రోడ్లపైకి రావాలంటే బయపడే పరిస్థితి మొదలైంది. 

ప్యానల్ స్పీకర్ గా కాసేపు గీతారెడ్డి

 ప్యానల్ స్పీకర్ గా కాసేపు గీతారెడ్డి 

ఈరోజు అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి కాసేపు స్పీకర్ గా వ్యవహరించారు. స్పీకర్ మధుసూధనా చారి అస్వస్థతకు గురి కావడం,డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి మధ్యలో విరామం తీసుకోవడంతో కాసేపు ప్యానల్ స్పీకర్ గా గీతా రెడ్డి స్పీకర్ చైర్ లో కూర్చొని కాసేపు సభా వ్యవహారాలను నడిపించారు. అనుకోని అవకాశంతో కాసేపు స్పీకర్ గా గీతా రెడ్డి వ్యవహరించడం అసెంబ్లీ లో ఆసక్తికర సంఘటన. 

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ తగలబోతుందా???కెసిఆర్ కి లేఖాస్త్రం వెనుక మర్మం అదేనా???

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ తగలబోతుందా???కెసిఆర్ కి లేఖాస్త్రం వెనుక మర్మం అదేనా???

తెలంగాణా ముఖ్యమంత్రిపై పదునైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే నేత ఎవరంటే మొదట వినిపించే పేరు రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి ఈ అసెంబ్లీ సమావేశాల్లో తన దూకుడు తగ్గించాడు అంతేకాదు తొలిసారి ముఖ్యమంత్రి కెసిఆర్ కి రేవంత్ గ్రూప్-2వాయిదా వేయాలని,గ్రూప్-2పోస్టుల సంఖ్య పెంచాలని,ఎక్షైజ్ పోస్టుల వయోపరిమితి పెంచడంతో పాటు గ్రూప్-3నోటిఫికేషన్ విడుదల చేయలాని లేఖ రాసిన రేవంత్ లేఖ రాసి రెండు రోజులు కాకముందే గ్రూప్-2వాయిదా నిర్ణయం,గ్రూప్-2పోస్టుల పెంపుకు కెసిఆర్ అంగీకారం తెలపడం చూస్తుంటే ఇదంతా తెరవెనుక మంత్రంగామేనని టిఅరేస్ నేతలు చెపుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో చంద్రబాబు కి దిమ్మతిరిగే షాక్ తగలనుందని తెలుస్తుంది. టిఅరేస్ లో రాజకీయ ఓనమాలు దిద్దిన రేవంత్ మళ్లీ టిఅరేస్ గూటికి చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

పాలేరు పీఠం పై కారు కన్ను???ఉపఎన్నిక వ్యూహం సిద్దం

పాలేరు పీఠం పై కారు కన్ను???ఉపఎన్నిక వ్యూహం సిద్దం 

పిఏసీ చైర్మెన్ రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతితో ఖాళీ అయిన ఖమ్మం పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికపై టిఅరేస్ వ్యూహం సిద్దం చేస్తుంది. పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఏకగ్రీవానికి సహకరించాలని ప్రయత్నిస్తున్నా ఎన్నికలు ఏదైనా గెలుపే తమతో సహవాసం చేస్తున్న నేపధ్యంలో టిఅరేస్ కొత్త వ్యూహం సిద్దం చేస్తుంది.ఎన్నికల బరిలో వెంకటరెడ్డి బార్య లేక కుటుంబ సభ్యుల నిలిపితే వారిని స్వతంత్ర అభ్యర్థులుగా నిలిపి గెలిపిస్తే టిఅరేస్ లో చేర్చుకోవాలి లేదా కాంగ్రెస్ నుండి వెంకట్ రెడ్డి అన్న దామోదర్ రెడ్డి లేదా అతని అన్న కుమారుడు చరణ్ రెడ్డి లలో ఎవరినైనా ఎన్నికల్లో నిలిపితే టిఅరేస్ తరుపున పోరుకు సై అంటున్న వరంగల్ నేత నరేష్ రెడ్డి లేదా గతంలో వైసిపి నుండి పోటీ చేసి టిఅరేస్ లో చేరిన నరేష్ లను ఎన్నికల్లో నిలపాలని అధికార పక్షం వ్యూహం రచిస్తుంది. ఇక మంత్రి తుమ్మల సైతం కెసిఆర్ ఆదేశిస్తే పోటీ కి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. పాలేరు ఉప ఎన్నిక ఎలా ఉంటుందో??పాలేరు ఎవరి ఖాతాలో చేరుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. 

మరో మారు వెలుతున్నాడు కేటిఆర్ విదేశీ పర్యటనకు...!

మరో మారు వెలుతున్నాడు కేటిఆర్ విదేశీ పర్యటనకు...!


తెలంగాణా ఐటీ మరియు పంచాయితీరాజ్ ,పురపాలిక మంత్రి వర్యులు కేటిఆర్ మరోమారు విదేశీ పర్యటనలకు వెల్లనున్నాడు. రాష్ట్ర సర్కార్ ఏప్రిల్ 4న కొత్త ఐటీ పాలసీ ప్రకటించనున్న నేపధ్యంలో కేటిఅర్ పర్యటన ప్రాముఖ్యం సంతరించుకోనుంది. ఇంతకుముందు కేటిఅర్ అమెరికా పర్యటన లో గూగుల్ ,మైక్రోసాఫ్ట్ ,అమేజాన్ వంటి దిగ్గజాలను హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టుటకు వారితో చర్చలు జరపడంలో విజయవంతం అయిన కేటిఅర్ ఏప్రిల్ 13నుండి 18వరకు మారిషస్ ,బ్రిటన్ లో పర్యటించనున్నారు. తొలుత మారిషస్ లో అడుగుపెట్టనున్న కేటిఅర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ అమలులో మారిషస్ కు రాష్ట్ర సహకారం పై చర్చల అనంతరం అక్కడి ఐటీ ,పారిశ్రామిక నిపుణులతో చర్చించనున్నారు. అలాగే 13,14తేదిల్లో ఆయుష్ సదస్సుకు హాజరుకానున్నారు. అనంతరం బ్రిటన్ వెల్లి అక్కడి ఐటీ మరియు పారిశ్రామిక దిగ్గజాలతో బేటీ అయి తెలంగాణాలో పెట్టుబడుల సానుకూలతలు వివరించనున్నారు. 

Friday, 25 March 2016

అల్లుడి సిద్దిపేట్ ఇలాకాలో పోరుకు ముందే కారు జోరు...!ప్రత్యర్థులు బేజారు...!

అల్లుడి సిద్దిపేట్ ఇలాకాలో పోరుకు ముందే కారు జోరు...!ప్రత్యర్థులు బేజారు...!


సిద్దిపేట్ మున్సిపల్ ఎన్నికల్లో పోరుకు ముందే కారు జోరు మొదలైంది. కారు జోరు,టిఅరేస్ వ్యూహాలతో ప్రత్యర్థులు బెజారైపోతున్నారు. ఎన్నికలు ఏవైనా ఘన విజయమే లక్ష్యంగా కదులుతున్న టిఅరేస్ శ్రేణులు సిద్దిపేట్ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసాక 34వార్డుల్లో 6వార్డుల్లో టిఅరేస్ అభ్యర్థులు ఏకగ్రీవ విజయం సాదించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేసరికి 166మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా మిగిలిన 28వార్డుల్లో 143మంది బరిలో నిలిచారు. ప్రచార పర్వం మొదలవకముందే వ్యూహాత్మక జోరులో 6వార్డులను ఏకగ్రీవం చేసుకున్న హరీష్ రావు క్లీన్ స్వీప్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. సిద్దిపేట్ మున్సిపాలిటీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనుండగా ,ఏప్రిల్ 11న కౌంటింగ్ జరగనుంది. 

హైదరాబాద్ కి చెందిన స్టార్టప్ కంపెనీలో సచిన్ టెండూల్కర్ పెట్టుబడులు???

హైదరాబాద్ కి చెందిన స్టార్టప్ కంపెనీలో సచిన్ టెండూల్కర్ పెట్టుబడులు???

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సైతం స్టార్టప్ లపై ద్రుష్టి సారించి హైదరాబాద్ కి చెందిన స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ కి చెందిన ఎన్ఆర్ఐ మహేష్ లింగారెడ్డి స్థాపించిన 'స్మాట్రాన్' స్టార్టప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే స్మాట్రాన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సచిన్ ఎంత ఇన్వెస్ట్ చేయనున్నాడో మాత్రం వేల్లడవట్లేదు. 'ఇంటర్నెట్ ఆప్ థింగ్స్' ఆధారిత స్మార్ట్ డివైజ్ లను తయారు చేసే స్మాట్రాన్ 2014ఆగష్టు లో స్టార్ట్ అవగా వచ్చే ఏడాది తొలి త్రైమాషికంలో తమ ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకురానుంది. 

కెసిఆర్ ని కాపీ కొడుతున్న చంద్రబాబు???ఆంధ్రలో గిరి పుత్రిక కల్యాణ పథకంగా కెసిఆర్ కల్యాణ లక్ష్మి...!

కెసిఆర్ ని కాపీ కొడుతున్న చంద్రబాబు???ఆంధ్రలో గిరి పుత్రిక కల్యాణ పథకంగా కెసిఆర్ కల్యాణ లక్ష్మి...!

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలో అవుతూ తెలంగాణా సంక్షేమ పథకాలను కాపీ కొడుతూ కాపీ క్యాట్ గా మారుతున్నాడు. తెలంగాణాలో  కెసిఆర్ ఆపరేషన్ ఆకర్ష్ తో కుదేలైన చంద్రబాబు అక్కడ జగన్ పై ఆకర్ష్ అస్త్రాన్ని సందించాడు. అంగన్ వాడీలకు,ప్రభుత్వ ఉద్యోగులకు ,ఆర్టీసి కార్మికులకు కెసిఆర్ ను పాలో అవుతూ పీఅర్సీ ప్రకటించిన చంద్రబాబు,తెలంగాణా హరితహారం ఆంధ్ర నీరు-మీరు-మొక్క గా మార్చిన బాబు  ఇప్పుడు కెసిఆర్ కల్యాణ లక్ష్మి పై ద్రుష్టి సారించిన చంద్రబాబు ఆంధ్రలో ఎస్టీ బాలికలకు గిరిపుత్రికా కల్యాణ పథకాన్ని ప్రకటించాలని యోచిస్తున్నారు. తెలంగాణా సంక్షేమ పథకాలతో కెసిఆర్ కి ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తుండటంతో బాబు కెసిఆర్ వైపు చూస్తున్నారు.